
Nepals interim PM: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్..!
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో రాజకీయ అస్థిరత పెరిగిపోతున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రధానమంత్రి పదవికి కుల్మన్ ఘీసింగ్ (Kulman Ghising) బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జన్-జెడ్ పార్టీ అతని పేరును ప్రతిపాదించిన విషయం తెలిసింది. ఈ ప్రతిపాదన అన్ని రాజకీయ వర్గాల నుంచి ఆమోదం పొందినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ నియామకం సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించే వ్యక్తులుగా నేపాల్‌లో పలు ప్రముఖుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి, కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా, విద్యుత్తు బోర్డు మాజీ ఎండీ కుల్మన్ ఘీసింగ్ పేర్లు వినించాయి.
వివరాలు
కర్ఫ్యూ విధించిచిన సైన్యం
సుశీల కర్కి నేపాల్‌లో అత్యున్నత న్యాయస్థానానికి సీజేగా పనిచేసిన ఏకైక మహిళగా ప్రత్యేక గుర్తింపు పొందారు. బాలేంద్ర షా విద్యాభ్యాసం కోసం బెంగళూరులో ఉన్నత చదువులు పూర్తి చేశారు.. తాత్కాలిక నేత ఎంపికలో అధ్యక్షుడికి, జెన్-జెడ్‌కు సహకరిస్తామని నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నేతల అవినీతిపై నేపాల్‌లో చెలరేగిన హింస కాస్త సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మంగళవారం ముఖ్యమంత్రి కేపీ శర్మ ఓలి సహా అనేక మంత్రులు రాజీనామా చేయడంతో ఆందోళనకారులు కొంతమేర శాంతించారు. దేశంలో శాంతిభద్రతల బాధ్యతలను మంగళవారం రాత్రి నుంచే చేపట్టిన సైన్యం.. కర్ఫ్యూ విధించి కాఠ్‌మాండూ వీధుల్లో కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే.