LOADING...
Nepal Protests : నేపాల్‌లో దారుణం.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం 
నేపాల్‌లో దారుణం.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం

Nepal Protests : నేపాల్‌లో దారుణం.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
06:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో సోషల్ మీడియాలో నిషేధం విధించడంతో దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. జెన్ జెడ్ యువత ప్రధానంగా పాల్గొని ప్రారంభించిన నిరసనలు, కాలక్రమేణా హింసాత్మక రీతిలో మారిపోయాయి. సోమవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఈ సంఘటన తో ఆందోళనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలి నివాసంతో పాటు అధ్యక్ష, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడి చేసి, నిప్పటించారు.

వివరాలు 

మాజీ ప్రధాని ఝలనాథ్ ఖనాల్ ఇంటికి నిప్పు 

ఇంకొక వైపు, రాజధాని ఖాట్మాండులో ఆందోళనలు మరింత తీవ్రత పొందాయి. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్ (65) ను నిరసనకారులు వీధుల్లో ఉరికించి కొట్టారు. ఇదే సమయంలో, మాజీ ప్రధాని ఝలనాథ్ ఖనాల్ ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు. ఇంట్లో ఉన్న ఆయన భార్య రాజ్యలక్ష్మీ చిత్రాకర్ తీవ్ర దగ్ధ గాయాలతో మృతిచెందినట్లు పలు మీడియా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఆమెను తన ఇంట్లో బంధించిన తరువాత ఆందోళనకారులు నిప్పుపెట్టినట్టు సమాచారం. ఈ దారుణ ఘటన ఖాట్మాండులోని డల్లు ప్రాంతంలో జరిగింది. చిత్రాకర్ ని కీర్తిపూర్ బర్న్ ఆస్పత్రికి తరలించారు, చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజీ ప్రధాని భార్య సజీవ దహనం