Page Loader
Thailand: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 20 మంది మృతి 
Thailand: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 20 మంది మృతి

Thailand: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 20 మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Jan 17, 2024
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

థాయ్‌లాండ్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 20మంది మరణించారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం బ్యాంకాక్‌కు ఉత్తరాన 120కిమీ దూరంలో ఉన్న సుఫాన్ బురి ప్రావిన్స్‌లో జరిగింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం వల్ల ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులందరూ చనిపోయారా లేదా అని తాము ఇప్పుడే చెప్పలేమన్నారు. అధికారులు దర్యాప్తు చేయడానికి సైట్‌లోకి వెళ్లినట్లు గవర్నర్ నట్టపట్ సువన్‌ప్రతీప్ పేర్కొన్నారు. ఇప్పటి వరకైతే, ఎంతమంది గాయపడ్డారనేది ఇంకా తెలియదని సువన్‌ప్రతీప్ చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వివరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనడానికి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వెళ్లిన ప్రధాని స్రెట్టా థావిసిన్.. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం