పుతిన్ కలల వంతెన అయినా క్రిమియా వంతెనపై మరోసారి పేలుళ్లు.. ఇద్దరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధక్ష్యుడు పుతిన్ కలల వంతెనగా పేరున్న కెర్చ్ బ్రిడ్జిపై మరోసారి పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో వంతెన కొంతభాగం దెబ్బతింది. దీంతో కెర్చ్ బ్రిడ్జిపై రాకపోకలకు రష్యా మూసివేసింది.
సోమవారం తెల్లవారుజామున 3.00-3.30 మధ్య సమయంలో కెర్చ్ బ్రిడ్జిపై రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ప్రమాదంలో చాలామంది బ్రిడ్జిపైనే చిక్కుకోగా.. ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా ఇంకా ధ్రువీకరించలేదు.
ఈ పేలుళ్ల వల్ల క్రిమియా వంతెనలో కొంత భాగం దెబ్బతిన్నట్లు గ్రేజోన్ అనే వాగ్నర్ అనుకూల టెలిగ్రామ్ ఛానల్ పేర్కొందని సీఎన్‌ఎన్ ధ్రువీకరించింది.
రష్యా వైపు నుంచి సరిగ్గా 145వ పిల్లర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Details
గతేడాది అక్టోబరులో క్రియామా వంతెనపై పేలుళ్లు
యుద్ధం చేసేటప్పుడు రష్యా బలగాలకు ఆయుధాలను పంపడంలో ఈ 19 కిలోమీటర్ల పొడువైన కెర్చ్ ఎంతో ముఖ్యమైంది.
నల్లసముద్రంపై అధికారం కోసం ప్రయత్నించిన రష్యా 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకన్న అనంతరం దాదాపు రూ.29వేల కోట్లతో ఈ రోడ్డు, వంతెనను నిర్మించింది.
2018లో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ట్రక్ నడిపి కెర్చ్ వంతెనను ప్రారంభించాడు.
గతేడాది అక్టోబర్ లో పుతిన్ పుట్టిన రోజు వేడుకలు జరిగిన మరుసటి రోజే ఈ వంతెనపై దాడి జరిగింది. అప్పట్లో ఉక్రెయిన్ సముద్ర డ్రోన్‌లో పేలుడు పదార్థాలు నింపి ఈ వంతెన కింద పేల్చినట్లు తెలుస్తోంది