Page Loader
US Earthquake: అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు జారీ 
అమెరికాలోని అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు జారీ

US Earthquake: అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు జారీ 

వ్రాసిన వారు Stalin
Jul 16, 2023
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. భూకంపం తర్వాత అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం 9.3 కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు యుఎస్‌జీఎస్ తెలిపింది. అలస్కా ద్వీపకల్పం, అలూటియన్ దీవులు, కుక్ ఇన్‌లెట్ ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయని అలస్కా భూకంప కేంద్రం తెలిపింది. అలస్కాలో మార్చి 1964లో 9.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర అమెరికా చరిత్రో ఇదే అత్యంత బలమైన భూకంపం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదు