Page Loader
USA: మిడిల్ ఈస్ట్‌కు చేరుకున్న F-15 ఫైటర్ జెట్‌లు..! 
మిడిల్ ఈస్ట్‌కు చేరుకున్న F-15 ఫైటర్ జెట్‌లు..!

USA: మిడిల్ ఈస్ట్‌కు చేరుకున్న F-15 ఫైటర్ జెట్‌లు..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా పశ్చిమాసియాలో తన సైనిక మోహరింపులను వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా ఎఫ్-15 ఫైటర్ జెట్‌లను మిడిల్ ఈస్ట్‌కు తరలించినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. ఇరాన్‌ దుందుడుకు చర్యలను నియంత్రించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ''ఈ రోజు 492వ ఫైటింగ్‌ స్క్వాడ్రన్‌కు చెందిన ఎఫ్‌-15 స్ట్రైక్ ఈగిల్స్‌ను మిడిల్ ఈస్ట్‌కు పంపాం. ఇవి ఇప్పటికే సెంట్రల్ కమాండ్‌ కేంద్రానికి చేరుకున్నాయి'' అని అమెరికా సైన్యం సోషల్‌ మీడియాలో పేర్కొంది. ఇందులో భాగంగా, బీ-52 బాంబర్లను గల్ఫ్‌ ప్రాంతంలోని సైనిక స్థావరాలకు తరలించారు. వీటితో పాటు ట్యాంకర్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, డెస్ట్రాయర్స్‌ కూడా మోహరించారు.

వివరాలు 

అమెరికా ఇరాక్‌కు హెచ్చరికలు జారీ

థాడ్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా మిడ్‌ ఈస్ట్‌లో అమర్చారు. ''ఇరాన్‌ లేదా దాని మద్దతుదారులు అమెరికా మిలటరీ లేదా ఇతర ప్రయోజనాలపై దాడిచేసే ప్రయత్నం చేస్తే, మా వారిని రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం'' అని వాషింగ్టన్‌ ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థలు తమపై దాడి జరగవచ్చని నివేదిక ఇచ్చాయి.ఈ దాడి ఇరాక్‌ వైపు నుంచి జరగవచ్చని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో,అమెరికా ఇరాక్‌కు హెచ్చరికలు జారీ చేసింది.అక్టోబర్ 1న ఇరాన్‌ దాదాపు 200 బాలిస్టిక్‌ క్షిపణులను ఇజ్రాయెల్‌ వైపు ప్రయోగించిందని, దీనివల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ఎక్కువయ్యాయి. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి రావడంతో, ఆయన ఇరాన్‌ విషయంలో కఠిన వైఖరి అవలంభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.