LOADING...
Trump-Mexico: విదేశీ విమానయాన సంస్థలకు FAA హెచ్చరిక.. ట్రంప్‌ మాదక ద్రవ్యాల యుద్ధ ప్రస్తావన!
విదేశీ విమానయాన సంస్థలకు FAA హెచ్చరిక.. ట్రంప్‌ మాదక ద్రవ్యాల యుద్ధ ప్రస్తావన!

Trump-Mexico: విదేశీ విమానయాన సంస్థలకు FAA హెచ్చరిక.. ట్రంప్‌ మాదక ద్రవ్యాల యుద్ధ ప్రస్తావన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా విమానయాన సంస్థలకు అగ్రరాజ్య ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. మెక్సికో, సెంట్రల్‌ అమెరికా, పనామా సహా తూర్పు పసిఫిక్‌ మహాసముద్రంలోని కొన్ని గగనతల ప్రాంతాలపై ప్రయాణిస్తున్నప్పుడు ఎయిర్‌లైన్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని FAA సూచించింది. సైనిక కార్యకలాపాల నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ప్రమాదం ఎదుర్కోవలసిన అవకాశం ఉందని FAA స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన అన్ని విమానయాన సంస్థలకు ఈ అడ్వైజరీ నోటీసులు జారీ చేయబడినవి. ఈ నోటీసులు 60 రోజుల పాటు అమల్లో ఉంటాయని FAA పేర్కొంది. "విమానం ఎంత ఎత్తులో ఉన్నా, ల్యాండింగ్‌, టేకాఫ్‌ దశల్లో ఉన్నా సరే.. ముప్పు ఎదుర్కోవచ్చని FAA తన నోటీసులో స్పష్టం చేసింది.

Details

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యక్ష హెచ్చరికలు జారీ

సాధారణంగా సమీప ప్రాంతాల్లో యుద్ధం లేదా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి హెచ్చరికలు జారీ చేయబడుతాయి. ఇటీవల మెక్సికోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యక్ష హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఆ దేశంలోని మాదకద్రవ్య ముఠాలు, స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భూతల దాడులు చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. లాటిన్‌ అమెరికాలోని మెక్సికో, క్యూబా, కొలంబియా వంటి దేశాలు మాదకద్రవ్యాలను తయారు చేసి అమెరికా లోకానికి అక్రమంగా రవాణా చేస్తున్నారని ట్రంప్‌ ఆరోపించారు. ఈ పద్ధతి కొనసాగితే వెనెజువెలా కూడా తీవ్ర పరిస్థితే ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Details

ఎయిర్ లైన్లకు హెచ్చరికలు జారీ

మాదకద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి కోసం ఇటీవల వెనెజువెలాపై అమెరికా సైన్యం మెరుపుదాడులు జరిపింది. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల మధ్య, మిగతా లాటిన్‌ అమెరికా దేశాలకు FAA ద్వారా ఎయిర్‌లైన్లకు జారీ చేసిన హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంతమంది విశ్లేషకులు ఈ FAA హెచ్చరికలు మెక్సికోపై భవిష్యత్తులో దాడులు చేయడానికి ముందస్తుగా చేయబడిన సాధనంగా భావిస్తున్నారు.

Advertisement