Page Loader
డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఈనెల 18లోగా లోంగిపోవాలని కోర్టు ఆదేశం
ఈనెల 18లోగా లోంగిపోవాలని కోర్టు ఆదేశం

డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఈనెల 18లోగా లోంగిపోవాలని కోర్టు ఆదేశం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 15, 2023
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కోసం రంగం సిద్ధమైంది. ఈ మేరకు ట్రంప్‌తో పాటు 18 మంది సహ-నిందితులకు జార్జియా న్యాయమూర్తి ఫణి విల్లీస్ అరెస్ట్ వారెంట్లను జారీ చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించడం, అనవసర జోక్యం లాంటి తీవ్ర ఆరోపణలు ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు న్యాయస్థానం గడువు ఇచ్చింది. వైట్ హౌస్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్, న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గిలియాని తదితరులు నిందితుల జాబితాలో ఉన్నారు.సాధారణంగా అమెరికాాలో గ్రాండ్ జ్యూరీ అభియోగాలు ఉన్న వారికి అక్కడి కోర్టులు అరెస్ట్ వారెంట్లను జారీ చేస్తాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అరెస్ట్ వారెంట్ జారీ