Page Loader
ఫెడరల్‌ కోర్టుకు హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు.. తాను నిర్దోషినని కోర్టుకు చెప్పిన ట్రంప్
తాను నిర్దోషినని కోర్టులో పేర్కొన్న ట్రంప్‌

ఫెడరల్‌ కోర్టుకు హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు.. తాను నిర్దోషినని కోర్టుకు చెప్పిన ట్రంప్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 04, 2023
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి న్యాయ విచారణను ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను (US PRESIDENTIAL ELECTION RESULTS) తారుమారు చేసేందుకు ఒడిగట్టారని అభియోగం ఎదుర్కొంటున్నారు. ఈ మేరకకు వాషింగ్టన్‌ లోని ఫెడరల్‌ కోర్టుకు గురువారం హాజరైన ట్రంప్ తాను నిర్దోషినని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రత్యర్థిగా తనను వేధించేందుకే ఈ అభియోగాలను మోపారన్నారు. ఈ మేరకు ఆయా అభియోగాలను ట్రంప్ తోసిపుచ్చారు. కోర్టు హాల్‌ వెనుక తలుపు నుంచి భారీ భద్రతతో ట్రంప్‌ కోర్టు హాల్ లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే తనపై ఉన్న అభియోగాలను జడ్జి మోక్సిలా ఉపాధ్యాయ్‌ చదివి వినిపించారు.మరోవైపు ఇదే కేసులో క్యాపిటల్‌ భవనంపై దాడికి పాల్పడ్డ వెయ్యి మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు.

DETAILS

బైడెన్‌ గెలుపును నిర్థారించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకు ట్రంప్ ప్రయత్నించినట్లు అభియోగాలు

అమెరికా చరిత్రలోనే ఇది చాలా విచారకరమని విచారణ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ అన్నారు. వాషింగ్టన్‌ నగరం అంతటా అపరిశుభ్రత రాజ్యమేలుతోందన్నారు.వాషింగ్టన్‌ను ఇలా చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. కోర్టుకు హాజరయ్యేందుకు న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్‌కు ఓ ప్రైవేట్‌ ఫ్లైట్ లో చేరుకున్నారు. కోర్టుకు బయలుదేరే కొద్ది గంటల ముందు ట్రూత్‌ ప్లాట్‌ఫాంపై(సోషల్ మీడియా) తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. 2020లో జో బైడెన్‌ గెలుపును నిర్థారించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకు ట్రంప్ ప్రయత్నించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు 2021 జనవరిలో క్యాపిటల్‌ భవనంపై ఆయన మద్దతుదారులు దాడి చేసినట్లు వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టులో కేసు రిజిస్టర్ అయ్యింది. తదుపరి విచారణ ఆగస్టు 28న ఉండనుంది.