LOADING...
Haiti: హైతీలో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 25 మంది మృతి
హైతీలో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 25 మంది మృతి

Haiti: హైతీలో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 25 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2024
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

హైతీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్‌ పేలిన ఘటన 25 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదానికి కారణం ట్యాంకర్‌ అదుపు తప్పి పల్టీలు కొట్టడం అని స్థానికులు వివరించారు. హైతీ తాత్కాలిక ప్రధాని గ్యారీ కొనిల్‌ ఘటనాస్థలికి చేరుకుని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన భయంకరమైనదని, తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర బృందాలు నిరంతరం కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు.

Details

దేశంలో అత్యవసర పరిస్థితి

హైతీ రాజధాని పోర్ట్‌ ఒ ప్రిన్స్‌ ప్రస్తుతం క్రిమినల్‌ ముఠాల ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ముఠాల వల్ల స్థానికులు ఇళ్లు వదిలి పారిపోవడం, ఆకలి సంక్షోభం, లైంగిక హింస వంటి సమస్యలు అధికమవుతున్నాయి. దేశంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉంది. సాయుధ బలగాల ఒత్తిడితో ప్రధాని అరియల్‌ హెన్రీ రాజీనామా చేయడంతో గ్యారీ కొనిల్‌ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

Advertisement