Joe Biden: ట్రంప్ ప్రమాణ స్వీకారానికి గంటల ముందు.. ఆంటోనీ ఫౌచీ, మార్క్ మిల్లె తదితరులకు జో బైడెన్ క్షమాభిక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష పదవీకాలం మరికొన్ని గంటల్లో ముగియనున్న సందర్భంలో, జో బైడెన్ (Joe Biden) కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
గతంలో ట్రంప్‌ను విమర్శించిన ప్రముఖ అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ,రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లే వంటి వారికి ముందస్తు క్షమాభిక్ష (Preemptive Pardons)ఆదేశాలను జారీ చేశారు.
వీరితో పాటు క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ చేపట్టిన హౌస్ కమిటీ సభ్యులకు కూడా ఉపశమనం కలిగించారు.
ట్రంప్ (Donald Trump)అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీకార చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా ఈ చర్యలు తీసుకున్నామని జో బైడెన్ వెల్లడించారు.
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్షకు జోబైడెన్ నిర్ణయం
Biden pardons Fauci, Milley, Jan. 6 committee members before Trump inauguration. https://t.co/1wR0QSoEYE
— FoxNashville (@FOXNashville) January 20, 2025
(AP Photo/Jose Luis Magana) pic.twitter.com/oO6UMUjkTo