Loading...
Thailand: ఫుకెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి!
థాయిలాండ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి!

Thailand: ఫుకెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుకెట్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది గాయపడ్డారు. ఫుకెట్‌లోని పటాంగ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ వాణిజ్య భవనంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనాల అద్దె వ్యాపారం నిర్వహిస్తున్న ఈ భవనంలో తెల్లవారుజామున 3.17 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు తీవ్రరూపం దాల్చి పక్కనే ఉన్న పలు భవనాలకు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

వివరాలు 

ప్రమాదంలో పర్యాటకులు వరూ మరణించలేదు: పోలీసులు

అయితే అప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

గాయపడిన వారిలో 15 మంది థాయిలాండ్ పౌరులు కాగా.. మరొకరు మయన్మార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఈ ప్రమాదంలో పర్యాటకులు ఎవరూ మరణించలేదని, గాయపడలేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఫుకెట్ పశ్చిమ తీరంలో ఉన్న ప్రసిద్ధ పటాంగ్ బీచ్‌కు సమీపంలోనే ఈ వాణిజ్య భవనం ఉంది.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని,ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా,నాలుగు నెలల క్రితం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ బార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో 27మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఫుకెట్‌లో మరోసారి ఇలాంటి ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫుకెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 

ADVERTISEMENT