Page Loader
Bird Flu: అమెరికాలో బర్డ్‌ ఫ్లూ కారణంగా తొలి మరణం.. వైరస్ వ్యాప్తిపై ఆందోళన
అమెరికాలో బర్డ్‌ ఫ్లూ కారణంగా తొలి మరణం.. వైరస్ వ్యాప్తిపై ఆందోళన

Bird Flu: అమెరికాలో బర్డ్‌ ఫ్లూ కారణంగా తొలి మరణం.. వైరస్ వ్యాప్తిపై ఆందోళన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 07, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం తీవ్ర సంచలనం రేపుతోంది. లూసియానాలో 65 ఏళ్ల వ్యక్తి బర్డ్‌ ఫ్లూ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొనేందుకు తోడు, ఇతర అనారోగ్య లక్షణాలతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు డాక్టర్లు వెల్లడించారు. అడవి పక్షులు, పెరటి పక్షులకు సమీపంగా ఉండటమే హెచ్‌5ఎన్‌1 వైరస్‌ సోకడానికి కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యక్తి నుంచి ఇతరులకు ఈ వైరస్‌ వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని స్పష్టంచేశారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం గతేడాది ఏప్రిల్‌ నుంచి అమెరికాలో సుమారు 70 మంది వ్యక్తులు బర్డ్‌ ఫ్లూ బారిన పడ్డారు.

Details

రోగి నుంచి వైరస్ శాంపిల్స్ సేకరణ

వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికులు, కోళ్ల ఫారాల కార్మికులు, పాడి పశువుల దగ్గర పనిచేసేవారే అని వివరించారు. 2022లో ప్రారంభమైన ఈ వైరస్‌ ప్రబలడం వల్ల దాదాపు 130 మిలియన్ల అడవి, దేశీయ పక్షులు ప్రభావితమయ్యాయి. ఈ వ్యాప్తి కారణంగా 917 పాడి పశువులు అనారోగ్యానికి గురయ్యాయి. లూసియానాలో మరణించిన రోగి నుంచి సేకరించిన వైరస్ శాంపిల్స్‌ను పరిశీలించిన వైద్యులు, అవి D1.1 జన్యు సంబంధిత కారకాలతో ఉన్నట్లు గుర్తించారు. ఇదే రకం వైరస్ ఇటీవల వాషింగ్టన్ స్టేట్‌లోని అడవి పక్షులు, పౌల్ట్రీలో కూడా కనిపించినట్లు తెలిపారు.