LOADING...
Germany: జర్మనీలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి
జర్మనీలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

Germany: జర్మనీలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
07:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర జర్మనీలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ కాల్పుల ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాంబర్గ్ పోర్టు నగరానికి సమీపంలోని స్టేడ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ దాడికి గల కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదని పోలీసులు వెల్లడించారు. అదుపులో ఉన్న రెండో వ్యక్తి పాత్రపై ఇంకా స్పష్టత రాలేదని మరో పోలీసు ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం మరెవరూ పరారీలో లేరని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారన్న వివరాలు ఇంకా వెల్లడికాలేదని, మృతి చెందిన వారంతా పెద్దవారేనని అధికారులు తెలిపారు.

వివరాలు 

2023లో హాంబర్గ్‌లో జరిగిన కాల్పులలో ఆరుగురి మృతి 

సుమారు 50వేల జనాభా ఉన్న స్టేడ్ పట్టణంలోని ఓ యువజన సంక్షేమ కేంద్రంలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన అనంతరం ఆ ప్రాంతానికి వెళ్లొద్దని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసి,ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అమెరికాతో పోలిస్తే జర్మనీలో సామూహికకాల్పుల ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయినప్పటికీ గత కొన్నేళ్లలో దేశంలో కొన్ని సంచలనాత్మక కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 2023లో హాంబర్గ్‌లోని యెహోవా సాక్షుల ప్రార్థనా మందిరంలో ఓ వ్యక్తి ఆరుగురిని కాల్చిచంపి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే 2016లో సామూహికహత్యలపై మోజు పెంచుకున్న 18ఏళ్ల జర్మన్-ఇరానియన్ యువకుడు మ్యూనిక్‌లో కనీసం తొమ్మిదిమందిని కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

Advertisement