Page Loader
అమెరికా స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థి జయకేతనం
భారత సంతతి విద్యార్థి దేవ్ విజయకేతనం

అమెరికా స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థి జయకేతనం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 02, 2023
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికాలో 95వ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీలు నిర్వహించారు. ఈ కాంపిటిటీషన్ లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌షా 230 మందిని తోసిరాజని అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. దాదాపుగా 11 మంది ఫైనల్స్‌కు చేరుకోగా, దేవ్ శామాఫైల్‌ అనే పదానికి స్పెల్లింగ్‌ చెప్పి 50 వేల డాలర్లను గెలుచుకోవడం విశేషం. ఇసుక నేలల్లో కనిపించే జీవిని లేదా మొక్కని శామాఫైల్‌ అంటారు. పోటీ అనంతరం ట్రోఫీని అందుకున్నాక దేవ్‌ స్పందించాడు. తాను ఇంకా నమ్మలేకపోతున్నానని, ఇప్పటికీ తన కాళ్లు వణుకుతున్నాయని చెప్పాడు. అనంతరం తన కుమారుడి విజయంపై గర్విస్తున్నట్లు అతడి తల్లి హర్షం వ్యక్తం చేశారు.

hkh

29 ఏళ్ల క్రితమే భారత్‌ నుంచి అమెరికాకు వలస

దేవ్‌ తండ్రి దేవల్‌ 29 ఏళ్ల క్రితమే భారత్‌ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. తన కుమారుడు మూడో ఏట నుంచే స్పెల్లింగ్‌ గుర్తుపెట్టుకుని చెప్తుండేవాడని దేవ్ తండ్రి దేవల్ చెప్పారు. ది నార్త్‌సౌత్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన పోటీల్లో దేవ్ పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సంస్థ భారత్‌లో స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది. గతంలోనూ దేవ్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో పాల్గొన్నాడని, 2019లో 51వ స్థానంలో.. 2021లో 76వ స్థానంతో సరిపెట్టుకున్నట్లు వెల్లడించారు. కానీ ఈసారి అన్నిటికంటే ప్రత్యేకంగా పోటీల్లో విజేతగా మారి తన కలను సార్థకం చేసుకున్నాడన్నారు. ఆర్లింగ్టన్‌ వర్జీనియాకు చెందిన 14 ఏళ్ల బాలిక ఛార్లెట్‌ వాల్ష్‌ రన్నరప్‌గా నిలిచింది.