
జర్నలిస్టులకు ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. 'X' అకౌంట్‌లో కథనాలు పోస్ట్ చేస్తే ఆదాయం
ఈ వార్తాకథనం ఏంటి
జర్నలిస్టులకు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ మేరకు X అకౌంట్(ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ ఓ ఆఫర్ ఇచ్చారు. అధిక ఆదాయం కావాలనుకునే పాత్రికేయులకు ఓ సూచన చేశారు.
ఇకపై తమ కథనాలను మరింత స్వేచ్ఛగా, నేరుగా తమ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తమ ఆదాయం పెరుగుతుందని వివరించారు.
అంతకుముందు మీడియా పబ్లిషర్స్‌కూ మస్క్ కొత్త ప్లాన్ వెల్లడించారు. కథనాలను అందించే వార్తా సంస్థలు, వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూల్ చేయాలని సూచనలు చేశారు.
కథనాల ఆధారంగా యూజర్ల నుంచి రుసుం వసూల్ చేయాలన్నారు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కోసం యూజర్లు సైన్ అప్ చేయకపోతే అదనంగా రుసుం చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మస్క్ ట్వీట్
If you’re a journalist who wants more freedom to write and a higher income, then publish directly on this platform!
— Elon Musk (@elonmusk) August 21, 2023