Khaleda Zia: ఆసుపత్రిలో చేరిన బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. 2021లో లివర్ సిర్రోసిస్‌గా నిర్ధారణ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా గురువారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 79 ఏళ్ల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ గుల్షన్‌లోని తన నివాసం నుండి తెల్లవారుజామున 1:40 గంటలకు ఎవర్‌కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. బీఎన్‌పీ మీడియా సెల్ సభ్యుడు సాయిరుల్ కబీర్‌ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె వైద్యుడు ప్రొఫెసర్ AZM జాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, మెడికల్ బోర్డు ఆమెకి కొన్ని పరీక్షలు చేయించాలని కోరింది. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆమెను ఓ ప్రైవేట్ క్యాబిన్‌లో ఉంచారు. పరీక్ష ఫలితాలను పరిశీలించిన తర్వాత ఆమె చికిత్స తేదీని నిర్ణయిస్తామని వైద్యుడు తెలిపారు. ఆగస్టు 21న ఖలీదా జియా 45 రోజుల చికిత్స తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది.
2021లో లివర్ సిర్రోసిస్ నిర్ధారణ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని గత ఐదేళ్లుగా గృహనిర్బంధంలో ఉన్నారు.అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ఆగస్టు 6న ఆయనకు విముక్తి లభించింది. ఆగస్టు 5న షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పతనం తర్వాత జియాపై ఉన్న అన్ని ఆరోపణల నుంచి విముక్తి పొందింది. BNP చీఫ్ చాలా కాలంగా లివర్ సిర్రోసిస్, ఆర్థరైటిస్, డయాబెటిస్,కాంప్లికేషన్‌లతో సహా వివిధ వ్యాధులతో పోరాడుతున్నారు. జూన్ 23న, ఆమె ఛాతీలో పేస్ మేకర్ అమర్చచారు.2021లో లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత, ఆమెను విదేశాలకు పంపాలని వైద్యులు సిఫార్సు చేశారు. ఈ నెలలో ఖలీదా జియా ఐదు వేర్వేరు కేసుల్లో నిర్దోషిగా విడుదలైంది.ఆమె 1991-1996, 2001-2006 మధ్య ప్రధానమంత్రి పదవిని నిర్వహించారు.