Page Loader
Canada: కెనడా మాజీ ప్రధాని కన్నుమూత
Canada: కెనడా మాజీ ప్రధాని కన్నుమూత

Canada: కెనడా మాజీ ప్రధాని కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 01, 2024
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడా మాజీ ప్రధాని బ్రియాన్ ముల్రోని(84)వృద్యాప్యం కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని అయన కుమార్తె కరోలిన్ ముల్రోని తన X అకౌంట్ లో ప్రకటించారు. బ్రియాన్ ముల్రోని కెనడియన్ రాజకీయ నాయకులలో పేరుగాంచిన వ్యక్తి. 1983 నుండి 1993 వరకు ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు. ముల్రోనీ 282 సీట్లలో 211 సీట్లను గెలిచి 1984లో తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు అయన దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను సమీకరించారు. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (NAFTA) రూపొందించడంలో ఆయన కృషి చేశారు. అయన మృతి పట్ల ప్రపంచ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కరోలిన్ ముల్రోని చేసిన ట్వీట్