
Pakistan: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పాక్ మాజీ ప్రధాని దరఖాస్తు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవిపై కన్నేశారు. ఇందుకోసం అయన దరఖాస్తు చేసుకున్నారు.
మాజీ ప్రధాని, మాజీ క్యాబినెట్ మంత్రికి ప్రత్యేక సహాయకుడిగా ఉన్న సయ్యద్ జుల్ఫీ బుఖారీ ఈ సమాచారాన్ని ఎక్స్‌లో తెలిపారు.
"ఇమ్రాన్ ఖాన్ సూచనల మేరకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ ఎలక్షన్ 2024 కోసం అయన దరఖాస్తు ఫారమ్ సమర్పించబడింది. ఒక చారిత్రాత్మక ప్రచారానికి అందరి మద్దతు కోసం మేము ఎదురుచూస్తున్నాము"అని య్యద్ జుల్ఫీ బుఖారీ తెలిపారు.
వివరాలు
ఇమ్రాన్ ఆక్స్‌ఫర్డ్ మాజీ విద్యార్థి
మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఆక్స్‌ఫర్డ్‌లోని కేబుల్ కాలేజీ పూర్వ విద్యార్థి. పాకిస్థాన్ మాజీ ప్రధాని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి జైలు నుంచే ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా పోటీ చేయనున్నారు.
ఖాన్ 1972లో ఆక్స్‌ఫర్డ్‌లోని కేబుల్ కాలేజీలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ చదివారు.
71 ఏళ్ళ ఇమ్రాన్ ఖాన్, ఆగస్టు 2023 లో అనేక కేసులలో అరెస్టయ్యాడు. వాటిలో కొన్ని నేరాలు అంగీకరించాడు. అతనికి 9 సంవత్సరాల శిక్ష పడింది.