Pakistan: 2 అవినీతి కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను నిర్దోషిగా ప్రకటించిన ఇస్లామాబాద్ హైకోర్టు
2018లో దోషిగా తేలిన రెండు అవినీతి కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం నిర్దోషిగా ప్రకటించింది. అవినీతికి పాల్పడినందుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో వైద్య చికిత్స పొందేందుకు 2019లో లండన్‌కు వెళ్లేందుకు అనుమతి లభించిన తర్వాత షరీఫ్ స్వయం ప్రవాసం నుంచి అక్టోబర్‌లో స్వదేశానికి తిరిగి వచ్చారు. జూలై 2018లో, అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీస్ అవినీతి రిఫరెన్స్‌లో అకౌంటబిలిటీ కోర్టు PML-N నాయకుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
NABకి సహకరించనందుకు ఒక సంవత్సరం శిక్ష
ఈ కేసులో ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉండటం, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB)కి సహకరించనందుకు ఒక సంవత్సరం శిక్ష ఏకకాలంలో అమలు చెయ్యాలని పాకిస్తాన్‌కు చెందిన డాన్ నివేదించింది. ఈ కేసులో దోషిగా తేలినందుకు నవాజ్ చేసిన అప్పీల్‌పై ఐహెచ్‌సి చీఫ్ జస్టిస్ అమీర్ ఫరూక్, జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది.