France transit visa rules for Indians: ఇండియన్స్‌కు ఫ్రాన్స్ బిగ్ రిలీఫ్.. ట్రాన్సిట్ వీసా రూల్స్‌లో మార్పు
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్ ద్వారా ప్రయాణించే భారతీయులకు పెద్ద ఊరట లభించింది.ఇకపై ఫ్రాన్స్ ఎయిర్‌పోర్టుల్లో ట్రాన్సిట్ వీసా అవసరం లేకుండా ప్రయాణించొచ్చు. భారత్ పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలోని ఫ్రాన్స్ ఎంబసీ వెల్లడించిన ప్రకారం,2026 ఏప్రిల్ 10నుంచి సాధారణ భారత పాస్‌పోర్ట్ ఉన్న ప్రయాణికులు ఫ్రాన్స్ ఎయిర్‌పోర్టుల అంతర్జాతీయ జోన్‌లో ఉండి,మరో దేశానికి వెళ్తుంటే ట్రాన్సిట్ వీసా అవసరం ఉండదు. అయితే లేఓవర్(Layover)సమయంలో ఎయిర్‌పోర్ట్ బయటకు వెళ్లకుండా అంతర్జాతీయజోన్‌లోనే ఉండాలి. ఫిబ్రవరి 2026లో తీసుకున్నఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు ఏప్రిల్ 9న అధికారికంగా ప్రచురించగా,మరుసటి రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈమార్పు కారణంగా భారత ప్రయాణికులకు ఫ్రాన్స్ ద్వారా ట్రావెల్ చేయడం ఇప్పుడు మరింత ఈజీ అయింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రాన్సిట్ వీసా లేకుండా ప్రయాణం ఇక సులువు
Embassy of France in India- "With effect from 10 April 2026, Indian nationals possessing an ordinary passport are no longer required to hold an airport transit visa when passing through the international zone of airports located on French territory. This measure applies to… pic.twitter.com/genxVyKQe3
— ANI (@ANI) April 23, 2026