LOADING...
Nepal: నేపాల్ ప్రధాని ఓలి రాజీనామాకు డిమాండ్‌.. మాజీ ప్రధాని ఇల్లును ధ్వంసం చేసిన నిరసనకారులు
మాజీ ప్రధాని ఇల్లును ధ్వంసం చేసిన నిరసనకారులు

Nepal: నేపాల్ ప్రధాని ఓలి రాజీనామాకు డిమాండ్‌.. మాజీ ప్రధాని ఇల్లును ధ్వంసం చేసిన నిరసనకారులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో నిరసనలు రెండో రోజు కూడా భారీగా కొనసాగుతున్నాయి. యువత ప్రధానంగా ముందుకొచ్చి సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. మొదటిసారి శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళన హింసాత్మకంగా మారింది. వేలాంది మంది జనరేషన్‌ జెడ్‌ ఆందోళనకారులు సోమవారం దేశ రాజధాని కాఠ్మాండు లో చేపట్టిన ఉద్యమం రణరంగాన్ని తలపించింది. ఆందోళన పెరగడంతో ప్రభుత్వం చివరికి సోషల్‌ మీడియాపై పెట్టిన నిషేధాన్ని తొలగించాల్సి వచ్చింది. అయినప్పటికీ, నిరసనలు చల్లారట్లేదు.

వివరాలు 

దేశంలోని అనేక ప్రధాన ప్రాంతాల్లో కర్ఫ్యూ

ఈ క్రమంలో వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా, నేపాల్‌ మాజీ ప్రధాన మంత్రి పుష్ప కమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ గారి నివాసాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. అలాగే పలువురు మంత్రుల, రాజకీయ నేతల నివాసాలపై రాళ్లతో దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ హింసాత్మక సంఘటనల నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం రాజధాని కాఠ్మాండూ నగరం సహా దేశంలోని అనేక ప్రధాన ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రకటించింది.

వివరాలు 

కేపీ ఓలి రాజీనామాకు డిమాండ్ 

ఇప్పటి వరకు నిరసనల్లో పాల్గొన్న యువత చాలా మంది ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి నిరసనలు ప్రారంభించారు. రోడ్లను అడ్డుకుని, టైర్లను కాల్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. 'ప్రభుత్వంలోని హంతకులను శిక్షించండి. పిల్లలను చంపడం ఆపండి. అవినీతి నాయకులపై చర్యలు తీసుకోండి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాన మంత్రి కేపీ ఓలి (Nepal PM KP Oli) తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

వివరాలు 

దుబాయ్‌ వెళ్ళేందుకు సిద్దమైన ప్రధాని 

మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది.యువత ఆందోళన కారణంగా ఇప్పటికే పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యంగా ప్రధాని కేపీ ఓలి కూడా దేశాన్ని వదిలి పారిపోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన దుబాయ్‌ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఉప ప్రధానికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు అధికారిక సమాచారం వెలువడింది.