
Germany: జర్మనీ పార్లమెంట్ రద్దు.. ఫిబ్రవరి 23న ఎన్నికలు
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మీర్ శుక్రవారం నాడు పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ పాలక కూటమి విచ్ఛిన్నం కావడంతో ఫిబ్రవరి 23న ఎన్నికలకు కొత్త తేదీని షెడ్యూల్ చేశారు.
ఆర్థిక పునరుద్ధరణ వ్యూహాల గురించి అసమ్మతి సమయంలో అయన ఆర్థిక మంత్రిని తొలగించిన తరువాత,స్కోల్జ్ వివాదాస్పద మూడు-పార్టీల సంకీర్ణం నవంబర్ 6న కూలిపోయింది.
733-సీట్ల బుండెస్టాగ్‌లో,స్కోల్జ్ అయనకి అనుకూలంగా 207ఓట్లను మాత్రమే సాధించాడు.
తదనంతరం,అయన డిసెంబర్ 16 న విశ్వాస ఓటింగ్‌లో ఓడిపోయాడు.ఇప్పుడు మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నట్లు AP నివేదించింది.
ప్రారంభషెడ్యూల్ కంటే ఏడు నెలల ముందుగా అంటే ఫిబ్రవరి 23న పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించేందుకు పలువురు ప్రముఖ పార్టీ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జర్మనీ పార్లమెంట్‌ను రద్దు చేసిన అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్
BREAKING: German president dissolves parliament, sets Feb 23 election date https://t.co/29VOY4AtwD pic.twitter.com/mJhSstNAxf
— Insider Paper (@TheInsiderPaper) December 27, 2024