Page Loader
Michelle Obama : ట్రంప్‌కు అధికారమిస్తే ప్రమాదమే.. కీలక వ్యాఖ్యలు చేసిన మిషెల్ ఒబామా 
ట్రంప్‌కు అధికారమిస్తే ప్రమాదమే.. కీలక వ్యాఖ్యలు చేసిన మిషెల్ ఒబామా

Michelle Obama : ట్రంప్‌కు అధికారమిస్తే ప్రమాదమే.. కీలక వ్యాఖ్యలు చేసిన మిషెల్ ఒబామా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2024
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, ఆయన సతీమణి మిషెల్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తారేమో అనే భయం ఉందన్నారు. కమలా హారిస్‌ విజయం సాధిస్తే, ఆమె దేశానికి అసాధారణ అధ్యక్షురాలిగా అవుతారని . కానీ తాజా సర్వేలు హారిస్ కంటే ట్రంప్‌కు ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్లు సూచిస్తున్నాయి. ఇది మద్దతుదారుల మధ్య ఆందోళన, భయాన్ని కలిగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

Details

ట్రంప్ ఆలోచనలు ప్రమాదకరం 

ట్రంప్ పాలనలో నెలకొన్న అస్థిరత, ఆయన మానసిక స్థితి, దుందుడుకు ఆలోచనలు ప్రమాదకరమని తెలిపారు. ఇటువంటి తరుణంలో ప్రజలు ఆయనకు మద్దతివ్వడం తనకు అగ్రహాన్ని కలిగిస్తోందన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం కమలా హరీస్ చేస్తున్న కృషిని తాను ప్రోత్సహిస్తున్నానని, ట్రంప్ వంటి వ్యక్తులకు అధికారం ఇవ్వడం వల్ల, మహిళల జీవితాలు మరింత కష్టాల్లో పడే ప్రమాదముందన్నారు. ఇక రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌పై తన ప్రచారంలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. మరో 10 రోజుల్లో జరిగే ఎన్నికలు అమెరికా ప్రజల నిర్ణయానికి కీలకంగా నిలవనున్నాయి.