ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే'
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ వార్మింగ్(ఉపరితల ఉష్ణోగ్రతలు)పై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) ప్రపంచదేశాలను హెచ్చరించింది. వాతావరణ మార్పులపై శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఐపీసీసీ పెంపొందిస్తుంది.
2030ల ప్రారంభంలో ప్రపంచం 1.5డిగ్రీ సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్ పరిమితిని దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులకు కారణమయ్యే వినాశక పరిణామాలు ఊహించిన దానికంటే వేగంగా జరుగుతున్నాయని హెచ్చరించింది.
ఈ దశాబ్దాన్ని మానవ చరిత్రలో కీలకంగా చెప్పుకున్న నేపథ్యంలో ఉపరితల వేడిని తగ్గించే చర్యలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని ఐపీసీసీ కోరింది.
వాతావరణ మార్పుల అంశం రాబోయే సంవత్సరాల్లో తీవ్రమైన రాజకీయ, ఆర్థిక చర్చలకు ఆధారం అవుతాయని ఐపీసీసీ చెప్పింది.
గ్లోబల్ వార్మింగ్
పరిస్థితి ఇంకా చేయి దాటిపోలేదు: ఐపీసీసీ
వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నప్పటికీ ఇంకా పరిస్థితి చేయి దాటిపోలేదని ఐపీసీసీ చెప్పింది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మేల్కొని ఉద్గారాలు తగ్గింపుపై ఉమ్మడిగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చింది. భవిష్యత్‌ను దృష్టింలో ఉంచుకొని అన్ని రంగాల్లో స్థిరమైన ఉద్గారాల తగ్గింపులను సాధించడానికి పాటుపడాలని ఐపీసీసీ వెల్లడించింది.
వాతావరణ విపత్తును నిరోధించడానికి సాధనాలు ఉన్నప్పటికీ, వాటిని అనేక దేశాలు ఉపయోగించుకోవడం ఐపీసీసీ చెప్పుకొచ్చింది. దీన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించింది. 2018నుంచి గ్లోబల్ వాతావరణ నివేదికలను పరిశీలించిన తర్వాత తాము ఈ అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పింది.
1.5డిగ్రీ సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్ పరిమితి దాటితే పంటలపై ప్రభావం పడుతుందని, జీవవైవిధ్యంలో మార్పులు వస్తాయని, మంచుకొండలు కరిగిపోతాయని, సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, ఇలా అనేక చెడు పరిణామాలు జరుగుతాయని పేర్కొంది.