
Bangladesh Temple: బాంగ్లాదేశ్ జెషోరేశ్వరి ఆలయంలో కాళీమాత కిరీటం చోరీ
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాపూజ సందర్భంగా అక్కడి ప్రభుత్వం 4 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
అయితే, బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరా నగరంలోని శ్యామ్‌నగర్ లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలో బంగారు కిరీటం అపహరణకు గురైంది.
ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. అందులో ఒక యువకుడు బంగారు కిరీటాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ కాళీ ఆలయ కిరీటంతో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 2021లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
అందులో కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించారు. అయితే, ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ ప్రత్యేక సందర్భంలో దొంగతనం చేశారు.
వివరాలు
బంగారు కిరీటం కోసం గాలిస్తున్న బంగ్లాదేశ్ పోలీసులు..
ఈఆలయంలో దొంగతనం జరిగిన సంఘటన అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో చోటు చేసుకుంది.
ఆలయ పూజారి దిలీప్ కుమార్ బెనర్జీ రోజువారీ పూజను పూర్తి చేసిన తర్వాత దేవాలయానికి తాళాలు వేసి దాని నిర్వహణ బాధ్యత రేఖ సర్కార్‌కు అప్పగించారు.
అయితే,ఇతర పనుల్లో నిమగ్నమైన రేఖ సర్కార్ తిరిగి వచ్చి చూసే వరకు కాళీ మాతకు ధరించిన బంగారు కిరీటం కనిపించలేదు.
దీంతో ఈ విషయాన్ని పోలీసులకు వెల్లడించారు.రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఫకర్ తైజుర్ రెహ్మాన్ తెలిపారు.భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఇచ్చిన బహుమతి దొంగిలించబడిందని,దానిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
నిందితుడిని గుర్తించడానికి సీసీటీవి ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.