Washington:హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికా శుభవార్త.. ఆటోమేటిక్ రెన్యూవల్ గడువు 540 రోజులకు పొడిగింపు
హెచ్-1బీ వీసా పొందిన వారి జీవిత భాగస్వాములకు అమెరికా తాజాగా ఒక శుభవార్తను ప్రకటించింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్)గురువారం హెచ్-1బీ, ఎల్1 వీసాదారుల జీవిత భాగస్వాములకు ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ రెన్యూవల్ కాలపరిమితిని పెంచే నిర్ణయం తీసుకుందని ప్రకటించింది. ఇప్పటివరకు ఈ కాలపరిమితి 180 రోజుల వరకే ఉండేది.అయితే,తాజా ప్రకటన ప్రకారం,ఈ కాలపరిమితిని 540 రోజులకు పెంచాలని నిర్ణయించామని, ఇది వచ్చే జనవరి 13 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం 2022 మే 4న లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసిన వ్యక్తులకు మాత్రమే వర్తించనుంది. వీసా జారీ ప్రక్రియలో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం ఈ కాలపరిమితి పొడిగింపు అమలు చేయబడుతున్నది.