వేలాది మంది భారతీయ టెక్కీలకు గుడ్‌న్యూస్; H-1B వీసాపై అమెరికా కోర్టు కీలక తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
వేలాది మంది భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభించింది. H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు యునైటెడ్ స్టేట్స్‌లో పని చేయవచ్చని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో హెచ్-1బీ వీసా హోల్డర్లు సంతోషం వ్యక్తం చేశారు.
H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు దాదాపు 1,00,000 వర్క్ అథారిసేషన్స్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా లబ్ధి పొందే వారిలో భారతీయులే ఎక్కు వ సంఖ్యలో ఉన్నారు.
అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో సహా ప్రధాన టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేసుకోవడానికి అనుమతిచ్చే వ్యాజ్యాన్ని వ్యతిరేకించాయి.
హెచ్-1బీ వీసా
'సేవ్ జాబ్స్ యూఎస్ఏ' పిటిషన్ కొట్టివేత
H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు ఉపాధి అధికార కార్డులను ఇచ్చే ఒబామా కాలం నాటి నిబంధనలను కొట్టివేయాలని 'సేవ్ జాబ్స్ యూఎస్ఏ' అనే ఐటీ ఉద్యోగులతో కూడిన సంస్థ కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి తాన్యా చుట్కాన్ కొట్టివేస్తున్నట్లు తీర్పు చెప్పారు.
H-1B అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. ఇది యూఎస్ కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది.
భారతదేశం, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు H-1B వీసాపై ఆధారపడుతాయి.