
Airspace: భారత్-పాక్ కాల్పుల విరమణతో పాక్ గగనతలానికి గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని అన్ని రకాల రాకపోకలకు అనుమతించినట్లు ప్రకటించింది.
తాజా ప్రకటనలో పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (పీఏఏ) దేశంలోని అన్ని విమానాశ్రయాలు మళ్లీ పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.
'దేశవ్యాప్తంగా విమాన ప్రయాణానికి అన్ని ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు తమ తాజా షెడ్యూల్‌ను తెలుసుకోవడానికి సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలి.
Details
విమాన రాకపోకలు తిరిగి ప్రారంభం
శనివారం నుంచే పాకిస్తాన్ గగనతలాన్ని అన్ని రకాల విమానాల రాకపోకలకు తిరిగి ప్రారంభించాం. అందువల్ల ఎయిర్‌పోర్టుల్లో సాధారణ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని' పీఏఏ ప్రకటించింది.
కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగుపడడంతో గగనతలాన్ని తిరిగి తెరిచారు.