ప్రిగోజిన్ శరీరంలో గ్రనేడ్ శకలాలు.. కీలక విషయాలను వెల్లడించిన పుతిన్
విమాన ప్రమాదంలో రష్యాకు చెందిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ మరణించిన విషయం తెలిసిందే. అతని మరణం దర్యాప్తుపై తొలిసారిగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మాట్లాడారు. విమాన ప్రమాద అనంతరం ప్రిగోజిన్ సహా అందులో ప్రయాణిస్తున్న వారి శరీరాల్లో గ్రనేడ్ శకలాలను గుర్తించామని ఆయన వెల్లడించారు. పుతిన్ తన వార్షిక సమావేశం సందర్భంగా ఈ కీలక విషయాలను విలేకర్లకు తెలిపారు. ఆగస్టులో మాస్కో-సెయింట్ పీటర్స్ బర్గ్ మధ్యలో ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. దళం రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన కొన్ని నెలల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పుతిన్
మొదట పశ్చిమ దేశాలు ఈ ఘటన వెనుక క్రెమ్లిన్ హస్తం ఉందని ఆరోపించాయి. కానీ, తాజాగా పుతిన్ మాత్రం విమానం బయట నుంచి దాడి జరగలేదని పేర్కొన్నాడు. ఈ దర్యాప్తును తీరుపై పుతిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మృతులకు మద్యం, డ్రగ్స్ పరీక్షలు నిర్వహించలేదని మండిపడ్డాడు. గతంలో ఐదు కిలోగ్రాముల కొకైన్ ను గతంలో వాగ్నర్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న విషయాన్ని పుతిన్ గుర్తు చేశారు. తమ దేశంపై దాడి జరిగితే వందలకొద్ది క్షిపణులు ఏకకాలంలో గాల్లోకి లేచి, ఒఖ్క శత్రువు కూడా మిగలకుండా వేటాడతాయని ఆయన హెచ్చరించారు.