NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israel-Hezbollah: హసన్ నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ ని అంతం చేశాం: ఇజ్రాయెల్ సైన్యం
    తదుపరి వార్తా కథనం
    Israel-Hezbollah: హసన్ నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ ని అంతం చేశాం: ఇజ్రాయెల్ సైన్యం
    హసన్ నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ ని అంతం చేశాం: ఇజ్రాయెల్ సైన్యం

    Israel-Hezbollah: హసన్ నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ ని అంతం చేశాం: ఇజ్రాయెల్ సైన్యం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 23, 2024
    08:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్ చేతిలో హిజ్బుల్లాకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆ సంస్థ అధినేత హసన్‌ నస్రల్లా హత్య తర్వాత అతని బంధువు హషీమ్‌ సఫీద్దీన్‌ను వారసుడిగా భావించారు.

    ఈ సమయంలో ఇజ్రాయెల్ దాడుల్లో సఫీద్దీన్‌ మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

    తాజాగా ఇజ్రాయెల్ దళాలు ఈ వార్తను ధృవీకరించాయి. ఈ విషయంపై ఐడీఎఫ్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    "మూడు వారాల క్రితం జరిగిన దాడిలో హెజ్‌బొల్లా కార్యనిర్వాహక మండలి అధిపతి,జిహాద్ కౌన్సిల్ సభ్యుడు హషీమ్ సఫీద్దీన్ మరణించాడు.అతనితో పాటు హెజ్‌బొల్లా ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్ అధిపతి అలీ హుస్సేన్‌ హజిమా,ఇతర కమాండర్లు కూడా మృతి చెందారని ధృవీకరించాం,"అని ఐడీఎఫ్‌ పేర్కొంది.

    వివరాలు 

    సఫీద్దీన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా 

    అదే సమయంలో దాడి ప్రాంతంలో 25మందికి పైగా హెజ్‌బొల్లా మిలిటెంట్లు ఉన్నట్లు ఏరియల్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.

    లెబనాన్‌లోని దాహియాలో ఉన్న ఓ బంకర్‌లో సీనియర్ హెజ్‌బొల్లా నేతలతో హషీమ్‌ సమావేశం నిర్వహించారన్న సమాచారంతో ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది.

    ఈ దాడుల్లో లెబనీస్ గూఢాచార విభాగం అధిపతి హుస్సేన్‌ అలీ హజిమా,సఫీద్దీన్ మరణించారని అప్పట్లో అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

    తాజాగా ఐడీఎఫ్‌ దీనిని ధృవీకరించింది.కానీ హెజ్‌బొల్లా ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

    సఫీద్దీన్‌ హెజ్‌బొల్లా కార్యనిర్వాహక మండలి అధిపతిగా,జిహాద్‌ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు.

    2017లో సఫీద్దీన్‌ను అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది.నస్రల్లా మరణం తర్వాత హెజ్‌బొల్లా పగ్గాలు ఆయనకే ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి.

    ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన మరణించడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    హిజ్బుల్లా
    లెబనాన్

    తాజా

    Miss World 2025: ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో.. 'ఇక్కత్‌' వస్త్రాల ప్రాంగణంలో 'ప్రపంచ సుందరి' పోటీదారుల సందడి  తెలంగాణ
    Mayank Yadav: స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్ లక్నో సూపర్‌జెయింట్స్
    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్ పాకిస్థాన్
    Rain Alert: హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలెర్ట్ హైదరాబాద్

    ఇజ్రాయెల్

    Israel: ఇజ్రాయెల్ భూతల దాడులు.. లెబనాన్ సరిహద్దుల్లోని హెజ్బొల్లా స్థావరాలపై దృష్టి లెబనాన్
    Hezbollah: 'కాంకర్ ద గలిలీ' పేరుతో దాడులకు సిద్ధంగా హెజ్‌బొల్లా లెబనాన్
    Iran-Israel: 'మాతో యుద్ధానికి రావొద్దు'.. ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ అధ్యక్షుడి హెచ్చరిక ఇరాన్
    Iran-Israel:పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భారీ క్షిపణుల దాడి ఇరాన్

    హిజ్బుల్లా

    #Newsbytes Explainer హిజ్బుల్లాహ్ అంటే ఏమిటి? ఇజ్రాయెల్‌తో హిజ్బుల్లా యుద్ధం చేస్తుందా?  ఇజ్రాయెల్
    Lebanon Explosions: పేజర్ అంటే ఏంటి ? హిజ్బుల్లా సభ్యులు ఇప్పటికీ దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఇజ్రాయెల్
    Israel-Lebanon: హిజ్బుల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్..1000 రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసం  ఇజ్రాయెల్
    Explained: ఐరన్‌ డోమ్‌ ఎలా పనిచేస్తుంది.. సక్సెస్ రేటు ఎంత? ఐరన్‌ డోమ్‌

    లెబనాన్

    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్‌కు లెబనాన్, సిరియా నుంచి మరో యుద్ధ ముప్పు.. సరిహద్దులో అలజడి  ఇజ్రాయెల్
    ఇరాన్ ఆదేశంతోనే లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా మిలిటెంట్ల దాడి: ఇజ్రాయెల్  ఇజ్రాయెల్
    గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు  హమాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025