Israel: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ ఏరియల్ యూనిట్ అధిపతి మృతి
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ ఏరియల్ యూనిట్ అధిపతి సమీర్ అబు దక్కా మరణించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ, షిన్ బెట్ భద్రతా సంస్థలు సంయుక్తంగా వెల్లడించాయి. సెప్టెంబర్‌లో జరిగిన యుద్ధ విమానాల దాడిలో అబు దక్కా హతమైనట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. అక్టోబర్‌లో హమాస్ మాజీ వైమానిక శ్రేణి చీఫ్ అసేమ్ అబు రకాబా హత్యకు గురయ్యాక, అబు దక్కా అనేక డ్రోన్ దాడుల్లో కీలక పాత్ర పోషించాడు.
ఇజ్రాయెల్ దాడుల్లో 42,289 మంది పాలస్తీనియన్లు మృతి
హమాస్ వైమానిక కార్యకలాపాలలో ప్రముఖంగా ఉన్నాడు. అక్టోబర్ 7, 2023న జరిగిన ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడిలో, దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ పారాగ్లైడర్, డ్రోన్ చొరబాట్ల వెనుక కూడా అబు దక్కా కీలక పాత్ర పోషించాడు. ఈ దాడిలో 1,200 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ గాజాలో ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇటీవల గాజాపై జరుగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో 42,289 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆధారిత ఆరోగ్య అధికారుల ప్రకటించారు.