LOADING...
Israel - Lebanon: శాంతి చర్చల్లో ఇజ్రాయెల్‌-లెబనాన్‌..ఇరుపక్షాల అంగీకారం
శాంతి చర్చల్లో ఇజ్రాయెల్‌-లెబనాన్‌..ఇరుపక్షాల అంగీకారం

Israel - Lebanon: శాంతి చర్చల్లో ఇజ్రాయెల్‌-లెబనాన్‌..ఇరుపక్షాల అంగీకారం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 27, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొంతకాలంగా ఇజ్రాయెల్‌ సైన్యం, లెబనాన్‌కు చెందిన మిలిటెంట్‌ సంస్థ హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చల ప్రక్రియలో తొలి ముందడుగు పడిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శుక్రవారం వెల్లడించారు.

వివరాలు

ఆ వివరాలు వెల్లడించని అధికారులు..

భవిష్యత్తులో కుదిరే శాంతి ఒప్పందాలకు పునాదిగా నిలిచే ముసాయిదా ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేసినట్లు ఆయన తెలిపారు. మార్కో రూబియో ఈ ప్రకటన చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్‌, లెబనాన్‌కు చెందిన రాయబారులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. అయితే, ముసాయిదా ఒప్పందంలో పొందుపరిచిన నిబంధనలు లేదా ఇతర వివరాలను అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు.

Advertisement