
OpenAI Sam Altman: షాకింగ్ న్యూస్.. 'ఓపెన్‌ఎఐ' సీఈఓ పదవి నుంచి సామ్ ఆల్ట్‌మన్ తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
సామ్ ఆల్ట్‌మన్‌ను ఓపెన్‌ఎఐ(OpenAI) సీఈఓగా తొలగించినట్లు కంపెనీ ప్రకటించింది.
సామ్ ఆల్ట్‌మాన్‌ను తొలగించిన కొన్ని గంటల తర్వాత ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ కూడా తన రాజీనామాను ప్రకటించారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కంపెనీని నడిపించే ఆల్ట్‌మన్ సామర్థ్యంపై ఓపెన్‌ఏఐ బోర్డుకు నమ్మకం లేదని, సంస్థ అభివృద్ధి చెందుతున్నందున, కొత్త నాయకత్వం అవసరమని భావించినట్లు, అందుకే అతను కంపెనీ బోర్డు నుంచి తప్పుకుంటున్నారని వెల్లడించింది.
ప్రస్తుతం చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న మీరా మురాటిని తాత్కాలిక సీఈవోగా నియమించారు.
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ నాయకత్వంలో ఈ కంపెనీ నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)చాట్‌బాట్ చాట్‌జీపీటీని ఓపెన్‌ఏఐ అనే సంస్థ రూపొందించింది.
ఆల్ట్‌మాన్‌తో పాటు మరో ఐదుగురు ఈ కంపెనీకి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు.
చాట్ జీటీపీ
ఆల్ట్‌మాన్ ఏమి చెప్పాడంటే?
సీఈఓ పదవిని కోల్పోయిన తర్వాత సామ్ ఆల్ట్‌మాన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు.
ఓపెన్‌ఏఐలో పని చేసిన సమయం చాలా బాగుందన్నారు. ఇది తనకు వ్యక్తిగతంగా, ప్రపంచానికి ఆశాజనకంగా కొంత పరివర్తన కలిగించిందన్నారు.
ప్రతిభావంతులైన వ్యక్తులతో పనిచేయడం తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు.
ఇక ముందు ప్రయాణం ఎలా ఉంటుందో తర్వాత చెబుతానని వెల్లడించారు.
ఓపెన్‌ఏఐ సంస్థకు 2015లో పడింది. సామ్ ఆల్ట్‌మాన్‌తో పాటు, స్పేస్‌ఎక్స్, టెస్లా యజమాని ఎలాన్ మస్క్ ఓపెన్‌ఏఐ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు.
తొలినాళ్లలో ఈ కంపెనీకి చాలా నిధులు ఇచ్చిన మస్క్.. బోర్డులోకి మాత్రం రాలేదు.
అందుకే వ్యవస్థాపక సభ్యుల్లో గ్రెగ్ బ్రాక్‌మన్, ఇలియా సుత్‌స్కేవర్, జాన్ షుల్మాన్, వోజ్‌సీచ్ జరెంబా ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆల్ట్‌మాన్ ట్వీట్
i loved my time at openai. it was transformative for me personally, and hopefully the world a little bit. most of all i loved working with such talented people.
— Sam Altman (@sama) November 17, 2023
will have more to say about what’s next later.
🫡