చైనాలో భారీ భూకంపం.. 10 మందికి గాయాలు
చైనాలో ఆదివారం తెల్లవారుజామున భారీగా భూమి కంపించింది. బీజింగ్‌కి 300 కి.మీ దూరంలోని డెజౌలో 2.33 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదైనట్లు ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్స్ సెంటర్ ప్రకటించింది. ఈ క్రమంలో సుమారు 74 నివాసాలు కూలిపోయాయని చైనా సెంట్రల్ టీవీ వెల్లడించింది. 10మంది గాయాలపాలయ్యారని పేర్కొంది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మరోవైపు శనివారం రాత్రి 9.31 గంటలకు 5.8 తీవ్రతతో అఫ్గాన్ లోనూ భూమి కంపించింది. పాక్, జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో 181 కి.మీ లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఈ మేరకు దేశ రాజధాని దిల్లీ పరిసరాల్లో భూకంపం వచ్చింది. దీంతో మహానగర వాసులు ఇళ్లు విడిచి వెలుపలికి పరుగులు తీశారు.