మరోసారి అండమాన్ దీవుల్లో భూ ప్రకంపణలు.. 4.3 తీవ్రత నమోదు
అండమాన్ నికోబార్ దీవుల్లో మళ్లీ భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూ ప్రకంపణలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకటించింది. ఈ మేరకు రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదైనట్లు తెలిపింది. భూమికి 61 కి.మీ లోతులో భూమి కంపించిందని NCS పేర్కొంది. అండమాన్ దీవుల్లో గడిచిన 24 గంటల్లోనే రెండోసారి భూకంపం రావడం గమనార్హం. బుధవారం ఉదయం 5.40 గంటలకు మొదటిసారి 5.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. అంతకుముందు పోర్టు బ్లెయిర్ సమీపంలో జూలై 29న అర్ధరాత్రి 12.53 గంటలకు భూమి కంపించగా,తీవ్రత 5.8గా రికార్డైంది. పోర్టు బ్లెయిర్‌కు 126 కి.మీ దూరంలోనే భూకంప కేంద్రం ఉన్నట్లు వివరించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.