Page Loader
Donald Trump: 'నేను ఎప్పుడూ అనుకూలమే'.. హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ కీలక ప్రకటన
'నేను ఎప్పుడూ అనుకూలమే'.. హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ కీలక ప్రకటన

Donald Trump: 'నేను ఎప్పుడూ అనుకూలమే'.. హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2024
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

హెచ్‌1 బీ వీసాల విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ఈ చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇచ్చారు. ఈ వ్యవహారంపై ట్రంప్ స్పందించారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి ఉపయోగపడే ప్రత్యేక వీసా ప్రోగ్రాంలకు తన మద్దతును ప్రకటించారు. తాను ఎల్లప్పుడూ హెచ్‌1 బీ వీసాలకు అనుకూలంగా ఉంటానని, అందుకే మన దేశంలో ఆ వీసాలు ఉన్నాయని అన్నారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పుల కోసం ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీకి సంయుక్త సారథులుగా మస్క్, రామస్వామి నియమితులయ్యారు.

Details

4శాతానికి పడిపోయిన నిరుద్యోగ రేటు

టాలెంట్ ఎక్కడ ఉన్నా దానిని అందిపుచ్చుకోవాలని వారు చెప్పారు. మస్క్ ఈ వీసా ద్వారా అమెరికా చేరారు. కానీ ఈ విషయంపై రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ వేరే అభిప్రాయం వ్యక్తం చేశారు. సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసినప్పుడు తన రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 11 శాతం నుండి 4 శాతానికి పడిపోయిందని తెలిపారు. విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల ఈ విజయాన్ని సాధించామని, కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణిచ్చి, వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నారని చెప్పారు. అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Details

నిబంధనల్లో మార్పులు చేసిన ట్రంప్

ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను మరింత సులభంగా నియమించుకునేందుకు, బైడెన్ ప్రభుత్వం కొన్ని నిబంధనల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ మార్పుల ద్వారా సులువుగా ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. ఇది లక్షలాది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం అందిస్తుంది. ఈ వీసాలు టెక్నాలజీ కంపెనీలకు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాలు ఈ వీసాల నుంచి చాలా లాభం పొందినవి.