Page Loader
'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్
'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్

'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్

వ్రాసిన వారు Stalin
Apr 05, 2023
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు హష్ మనీ చెల్లింపులతో సహా 36 నేరారోపణలలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం( అమెరికా కాలామానం ప్రకారం) అరెస్టు అయ్యారు. అందులో తాను 34 నేరాలకు పాల్పడలేదని కోర్టులో ట్రంప్ అంగీకరించారు. విచారణ అనంతరం ట్రంప్ ఫ్లోరిడాలోని తన నివాసానికి వెళ్లి మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బైడెన్ పాలనలో అమెరికా నరకంలోకి వెళ్తోందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. తాను చేసిన నేరం ఒక్కటేనని చెప్పారు. దేశాన్ని నాశనం చేయాలనుకునే వారి నుండి రక్షించాలనుకోవడమే తాను చేసిన నేరమని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్

అమెరికాను చూసి ప్రపంచం నవ్వుతోంది: ట్రంప్

అమెరికా చరిత్రలోనే చీకటి రోజుల్లో అందరం జీవిస్తున్నామని ట్రంప్ చెప్పారు. కనీసం ఈ క్షణమైనా తాను గొప్ప ఉత్సాహంతో ఉన్నానన్నారు. ప్రపంచం ఇప్పటికే అమెరికాను చూసి నవ్వుతోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. 2016లోని అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, తరువాత హానికరమైన సమాచారాన్ని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను దాచడానికి వ్యాపార రికార్డులను తప్పుదారి పట్టించారని మాన్‌హాటన్ జిల్లా అటార్నీ ఆల్విన్ బ్రాగ్ ట్రంప్ పై అభియోగపత్రాన్ని ప్రకటించారు. బ్రాగ్ అభియోగపత్రంలో కీలకమైన పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు హష్ మనీ చెల్లింపులు సహా మూడు హష్-మనీ కేసులు ట్రంప్‌పై అయితే మొత్తం 36 ఆరోపణల్లో రెండు మాత్రమే ట్రంప్ అంగీకరించారు.

డొనాల్డ్ ట్రంప్

డిసెంబర్ 4న తదుపరి విచారణ

న్యూయార్క్‌లోని మాన్‌హాటన్ కోర్టు డొనాల్డ్ ట్రంప్‌ను డిసెంబర్ 4న తదుపరి విచారణకు పిలిచినట్లు సీఎన్ఎన్ నివేదించింది. తనపై ఉన్న 34 నేరారోపణలకు నిర్దోషి అని ప్రకటించిన ట్రంప్ ఎలాంటి ప్రకటనలు చేయకుండానే కోర్టు గది నుంచి వెళ్లిపోయారు. కోర్టు గది నుంచి బయలుదేరిన తరువాత, ట్రంప్ భవనం నుండి బయలుదేరి, బయట ఆపి ఉంచిన తన మోటర్‌కేడ్‌లోకి ప్రవేశించారు. అమెరికా చరిత్రలోనే క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటున్న మొదటి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కావడం గమనార్హం.