
Trump-Meloni: జార్జియా మెలోని ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరు: డొనాల్డ్ ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ గురించి ప్రస్తావిస్తూ, ఆమెపై తనకు ఎంతో అభిమానం ఉందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మెలోనీపై ప్రశంసల జల్లు కురిపించిన ట్రంప్, ఆమెను ఒక గొప్ప ప్రధాని అని అభివర్ణించారు.
వ్యక్తిగతంగా ఆమెతో తనకు మంచి సంబంధం ఉందని పేర్కొన్నారు. మెలోనీ ఎంతో ప్రతిభావంతురాలై, ప్రపంచంలో ఉన్న ప్రముఖ నాయకుల్లో ఒకరిగా ఆమెను కొనియాడారు.
అంతేకాక, అమెరికా తీసుకున్న టారిఫ్ పెంపు నిర్ణయానికి మెలోనీ వ్యతిరేకంగా స్పందించినప్పటికీ, ట్రంప్‌ను కలిసిన తొలి యూరోపియన్ దేశపు ప్రధానిగా ఆమె నిలిచారు.
ఇది ప్రత్యేకంగా గుర్తించదగ్గ అంశమని చెబుతున్నారు.
వివరాలు
త్వరలోనే బహుళ వాణిజ్య ఒప్పందాలు
ఇక గురువారం నాడు,జార్జియా మెలోనీతో డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్‌లో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అమెరికా యూరోపియన్ యూనియన్‌తో పూర్తిగా 100శాతం వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధమై ఉందని ట్రంప్ వెల్లడించారు.
వాణిజ్యసుంకాలపై ఇప్పటికే ఉన్నఉద్రిక్త పరిస్థితుల మధ్య,ఈప్రకటనను ట్రంప్ అత్యంత ధైర్యంగా ప్రకటించారు.
దీంతోపాటు,యూరోపియన్ యూనియన్ దిగుమతులపై ముందుగా విధించిన 20శాతం టారిఫ్‌ను 90 రోజులు పాటు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.
ఇది రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాల్లో సానుకూలత తీసుకువచ్చే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకా,ఇతర దేశాలతో కూడా బహుళ వాణిజ్య ఒప్పందాలు త్వరలోనే జరుగే అవకాశముందని ట్రంప్ సూచించారు.
ప్రతి దేశంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని అమెరికా తపనగా ఉందని ఆయన వివరించారు.