Donald Trump : ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు అవమానకరం
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వేడుకలు చాలా అవమానకరంగా జరిగాయాని విమర్శలు గుప్పించాడు. లియొనార్డో డావిన్సీ గీసిన 'లాస్ట్ సప్పర్' చేసిన ప్రదర్శన ఓ వర్గం విశ్వాసాలను కించపర్చేటట్లు ఉందని విమర్శలు వచ్చాయి. దీనిపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఏ మతాచారాలకు ఉద్దేశించి ఆ ప్రదర్శన చేయలేదని ఒలింపిక్స్ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు.
లాస్ ఏంజెల్స్ జరిగే ఒలింపిక్స్ లో ఇలాంటి ప్రదర్శనలు ఉండవు
ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో నృత్యకారులు, డ్రాగ్ క్వీన్‌లు, డీజేలు, వివిధ భంగిమలతో ఇస్తున్న ప్రదర్శనలు 'లాస్ట్ సప్పర్' ను గుర్తు చేసేలా ఉన్నాయని వాదనలు వినిపించాయి. 2028 లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో మాత్రం ఇలాంటి ప్రదర్శన ఉండదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. దీనిపై జాలీ క్లారిటీ ఇచ్చాడు. ఆ సన్నివేశాలు మతపరమైన ఘటనలను చిత్రీకరించే ఉద్దేశంతో చేయలేదని స్పష్టం చేశారు.