పాకిస్థాన్‌కు భారీ ఊరట.. 3 బిలియన్ డాలర్ల విడుదలకు ఐఎంఎఫ్ గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నా పాకిస్థాన్‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గతంలోనే ఐఎంఎఫ్‌తో జరిగిన ఒప్పందం కీలక దశకు చేరుకుంటోంది.
ఈ మేరకు త్వరలోనే ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోద ముద్ర వేయనుంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 3 బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టైంది.
ఈ నేపథ్యంలో పాక్ తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడనుంది.
అయితే జులైలో ఈ ఒప్పంద పత్రాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు ఐఎంఎఫ్ అధికార వర్గాలు ప్రకటన చేశాయి. కొన్ని కారణాల వల్ల గత కొద్ది నెలలుగా సదరు ఒప్పందంపై ఎలాంటి పురోగతి లేదు.
మరోవైపు ఒప్పందం ప్రకారం తాము సూచించిన నిబంధనలు పాకిస్థాన్ పాటించాల్సిందేనని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది.
DETAILS
2.5 బిలియన్ డాలర్లతో పాటు అదనంగా 0.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీ
ఐఎంఎఫ్ 2019లోనే 6.5 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని అంగీకరించింది. ఈ మేరకు అందులో నుంచి 2.5 బిలియన్ డాలర్ల సాయం విడుదల కోసం పాక్ వేచి చూస్తోంది.
పాక్ కు రావాల్సిన దానితో పాటు 0.5 బిలియన్ డాలర్లను అదనంగా ఇచ్చేందుకు తాజా ఒప్పందం కుదిరింది.
ఇటీవల కాలంలో పాక్ ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. తప్పుడు నిర్ణయాల కారణంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నిలిచిపోయి ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయిందని ఐఎంఎఫ్ అధికారి నాథన్ పోర్టర్ తెలిపారు.
ద్రవ్యలోటు తగ్గుదలకు పాక్ కృషి చేసినా విఫలమైందన్నారు. విదేశీ మారక నిల్వలూ పడిపోయాయన్నారు.
తాజా ఒప్పందం మేరకు తమ పాలసీ విధానాలు అమలు చేయడం సహా విద్యుత్ రంగంలో నిబంధనలు కొనసాగుతాయన్నారు.