
Gita Gopinath: ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్.. తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీకి..
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నగీతా గోపీనాథ్ ఈ ఏడాది ఆగస్టులో తన పదవిని నుంచి వైదొలగనున్నారని ఐఎంఎఫ్ వెల్లడించింది. పదవి నుంచి తప్పుకున్న అనంతరం ఆమె మళ్లీ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరనున్నట్లు పేర్కొంది. ఆమె స్థానంలో కొత్తగా ఆ పదవిని చేపట్టబోయే వ్యక్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా తెలిపారు. 2019లో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా గీతా గోపీనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ హోదాను చేపట్టిన తొలి మహిళగా గీతా చరిత్ర సృష్టించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్
#GitaGopinath will resume her place on the Harvard faculty this fall, returning from a long-term public service leave of absence. In 2018, she was named the first female Chief Economist at the #IMF and was promoted to First Deputy Managing Director in 2022#Harvard pic.twitter.com/5Eky2XofN1
— TheSouthAsianTimes (@TheSATimes) July 22, 2025