NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష‌
    తదుపరి వార్తా కథనం
    Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష‌
    ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష‌

    Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2025
    01:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్ ఖాదిర్ ట్రస్ట్ భూమి అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ , అతని భార్య బుష్రా బీబీ దోషులుగా తేలారు.

    కోర్టు ఇద్దరికి జైలుశిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్‌కు 14 సంవత్సరాలు, బుష్రా బీబీకి 7 సంవత్సరాల జైలుశిక్ష ఖరారైంది.

    ఈ కేసులో సుమారు 190 మిలియన్ పౌండ్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    అడియాలా జైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులో జడ్జి నాసిర్ జావేద్ రాణా తీర్పును వెలువరించారు.

    కోర్టు ఇమ్రాన్,బుష్రాలపై జరిమానా కూడా విధించింది. ఇమ్రాన్ ఖాన్‌కు 10 లక్షలు, బుష్రా బీబీకి 5 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే, మరింతగా 6 నెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

    వివరాలు 

    2023లో ఇమ్రాన్ ఖాన్‌పై అనేక లీగల్ కేసులు

    ఈ కేసు 2024, ఫిబ్రవరి 27న ఫైల్ అయ్యింది. యూకే నుంచి వచ్చిన 50 బిలియన్ రూపాయలను చట్టబద్ధం చేయడం కోసం ఇమ్రాన్,బుష్రా బహరియా టౌన్ లిమిటెడ్ నుంచి ఖరీదైన భూములను లంచంగా స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ఈ కేసులో ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు 2023,డిసెంబరు 23న తీర్పు ఇవ్వాల్సి ఉంది.

    కానీ, పలు కారణాల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చింది. 2023లో ఇమ్రాన్ ఖాన్‌పై అనేక లీగల్ కేసులు దాఖలయ్యాయి.

    ఈ కేసులు అన్నీ రాజకీయ కక్షతోనే నమోదైనట్లు ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

    తోషాఖానా, ఇద్దత్ కేసుల్లో ఇమ్రాన్ గత ఏడాది నిర్దోషిగా తేలాడు. కానీ తాజా కేసు అయిన తోషాఖానా-2 కేసు పై ఆయనపై కొత్త ఆరోపణలు వచ్చాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇమ్రాన్ ఖాన్

    తాజా

    Delhi: ప్రయాణికులకు అలర్ట్‌.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు దిల్లీ
    inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి! ఇంటర్
    Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక ఎలాన్ మస్క్
    Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వం

    ఇమ్రాన్ ఖాన్

    ఇమ్రాన్ ఖాన్‌ను ఏ జైలుకు పంపారు? ఎలాంటి సౌకర్యాలు కల్పించారంటే?  వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    Imran Khan: పాపం ఇమ్రాన్ ఖాన్.. బ్యాగ్ పెట్టడానికి కూడా స్థలం లేని ఇరుకు సెల్‌లో జైలు శిక్ష  తాజా వార్తలు
    తోష్ ఖానా కేసులో ఇమ్రాన్ కు ఊరట..విడుదలైన గంటలోపే మళ్లీ అరెస్ట్  అంతర్జాతీయం
    రహస్య పత్రాల లీకేజీ కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు సెప్టెంబరు 26వరకు రిమాండ్ పొడిగింపు  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025