Wolf: తాడును లాగి వలలోని ఎర తిన్న తొడేలు: ప్రపంచంలో ఇదే తొలిసారి..
ఈ వార్తాకథనం ఏంటి
ఎర వేసి చేపలు, పీతలు వంటి నీటి జీవులను పట్టడం సాధారణంగా మనుషులకే తెలిసిన నైపుణ్యంగా భావిస్తారు. ఇతర జంతువులు ఇలా చేయడం ఇప్పటివరకు చూడలేదు. కానీ బ్రిటిష్ కొలంబియా మధ్య తీరంలో జరిగిన ఓ సంఘటన ఈ భావనను పూర్తిగా మార్చేసింది. స్థానిక హీల్ట్సుక్ ఆదివాసీ సమూహం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా "యూరోపియన్ గ్రీన్ క్రాబ్" పేరుతో పిలువబడే పీతలను నియంత్రించేందుకు సముద్రంలో ప్రత్యేకమైన క్రాబ్ ట్రాప్‌లను అమర్చింది. సముద్ర పర్యావరణానికి హాని చేసే ఈ జాతిని తగ్గించడానికి, ఎర వేసి వలలు పెట్టి పట్టుకుంటున్నారు.
వివరాలు
ఈ సంఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డైంది
ఈ ట్రాప్‌లను నీటిలో స్థిరంగా ఉంచేందుకు తాడులతో కట్టివేసి వేశారు. అయితే అక్కడకు వచ్చిన ఓ ఆడ తొడేలు తాడును ఉపయోగించి క్రాబ్ ట్రాప్‌ను నీటిలోనుంచి బయటికి లాగి, అందులోని ఎరను తిన్నది. ఈ సంఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డైంది. తాడును లాగి వల నుంచి ఎరను పొందిన తొడేలు ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదైన తొలి ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు. పరిశోధకులు ఇంతవరకు లోతైన నీటిలో పడేసిన వలలను తొడేళ్లు లేదా ఎలుగుబంట్లు చేరుకోలేవని నమ్మేవారు. ఎందుకంటే ఇవి ఎక్కువ లోతుల్లో మునిగే జంతువులు కావు. కొంతమంది వలలు తక్కువ లోతుల్లో ఉండడం వల్ల పెద్ద జంతువులు అప్పుడప్పుడు వాటికి చేరుకునే అవకాశం ఉండేది.
వివరాలు
ఇతర తొడేళ్లు కూడా ఇలాంటి పద్ధతులను నేర్చుకునే అవకాశం ఉందా?
కానీ లోతైన నీటిలో ఉన్న ట్రాప్‌ను కూడా ఒక తొడేలు బయటికి లాగుతుందని ఎవరూ ఊహించలేదు. తీరానికి చేరిన ఆ తొడేలు,నీటిలో కనిపించనంత లోతులో ఒదిగి ఉన్న ట్రాప్ తాడును గమనించి, సరైన సమయానికి దాన్ని పైకి లాగింది. వలలోని ఎర..ఒక హేరింగ్ ముక్క..ను బయటికి తీసి తినేసింది.మొదట ట్రాప్‌ను లోతు నుంచి ఈడ్చుకుంటూ,తర్వాత నీరు తక్కువగా ఉన్న ప్రాంతానికి చేర్చి తన పని ముగించింది. ఈఅనూహ్యమైన ప్రవర్తనపై ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు,"ఇంకా ఇతర తొడేళ్లు కూడా ఇలాంటి పద్ధతులను నేర్చుకునే అవకాశం ఉందా?"అన్న దానిపై మరింత పరిశోధన చేయాలని భావిస్తున్నారు. జంతు ప్రవర్తన శాస్త్రవేత్త,యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన మార్క్ బెకాఫ్ ప్రకారం,ఈ సంఘటన భవిష్యత్తులో కొత్త అధ్యయనాలకు మార్గం సుగమం చేయనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తాడును లాగి వలలోని ఎర తిన్న తొడేలు
Researchers in western Canada captured rare footage of a wild wolf hauling a crab trap out of deep water. #canada #wildlife #science #wolves #research pic.twitter.com/w0QWlHCLYG
— Brut America (@brutamerica) November 24, 2025