
ఫ్రెంచ్: 6 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు.. అధికారుల అప్రమత్తం
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్‌లో ఆరు విమానాశ్రయాలకు ఒకేసారి బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.
అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టులను ఖాళీ చేయించారు. తర్వాత విమానాశ్రయాల్లో ముమ్మర తనిఖీలు చేశారు.
మొదట ఫ్రాన్స్‌లో లిల్లె ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. తర్వాత అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాశ్రయాన్ని తనిఖీచేశారు.
కొద్దిసేపటికి బ్యూవైస్, టోలౌస్, నైస్, లియాన్, నాంటెస్ ఎయిర్‌పోర్టులకు కూడా బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.
ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయాలను ఖాళీ చేయించారు. అధికారుల హడావుడిని చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నైస్ ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద బ్యాగు కన్పించినట్లు అధికారులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నైస్ ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద బ్యాగు
BREAKING:
— Visegrád 24 (@visegrad24) October 18, 2023
6 airports are being evacuated in France after threat of terrorism attack pic.twitter.com/V62xDDwOj2