
Pakistan : వాయువ్య పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో రెండు తెలగ మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో 30 మరణించారు. మరో 145 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఎగువ కుర్రం జిల్లాలోని బోషెరా గ్రామంలో ఐదు రోజుల క్రితం ఘర్షణలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇది గిరిజనులు, మత సమూహాల మధ్య మత ఘర్షణలు జరగడంతోనే పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని కుర్రం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Details
సంధి కుదిర్చిన పోలీసులు
పోలీసులు, జిల్లా యంత్రాంగం సాయంతో కొద్దిసేపటి క్రితం బోషెరా, మలిఖేల్ దండార్ ప్రాంతాలలో షియా, సున్నీ తెగల మధ్య సంధి కుదిర్చారని పోలీసులు తెలిపారు.
అయితే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.
మిగిలిన ప్రాంతాల్లో కూడా కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు.
నాలుగు రోజుల క్రితం జరిగిన భూ వివాదంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘర్షణలు పీవార్, తాంగీ, బలిష్‌ఖేల్, ఖార్ కలే, మక్బాల్, కుంజ్ అలీజాయ్, పారా చమ్కాని, కర్మన్‌తో సహా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.