NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Man kills wife: స్క్రూడ్రైవర్‌తో భార్యను చంపిన భర్త అరెస్ట్ 
    తదుపరి వార్తా కథనం
    Man kills wife: స్క్రూడ్రైవర్‌తో భార్యను చంపిన భర్త అరెస్ట్ 
    Man kills wife: స్క్రూడ్రైవర్‌తో భార్యను చంపిన భర్త అరెస్ట్

    Man kills wife: స్క్రూడ్రైవర్‌తో భార్యను చంపిన భర్త అరెస్ట్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 16, 2023
    09:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టర్కీలోని హోటల్ గదిలో స్క్రూడ్రైవర్‌తో తన 26 ఏళ్ల భార్యను దారుణంగా పొడిచి చంపిన బ్రిటిష్ టూరిస్ట్‌ని అరెస్టు చేశారు.

    26 ఏళ్ల మహిళ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఫాతిహ్ మెవ్‌లనాకపి జిల్లాలోని ఓ హోటల్‌లో శవమై కనిపించింది.

    హోటల్ సిబ్బంది దంపతుల గది నుండి అరుపులు విన్నట్లు నివేదించారు. బాధితుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

    అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది, పోలీసులు మహిళ మృతి చెందినట్లు నిర్ధారించారు.

    ఆమె గొంతుపై, శరీరం అంతటా గాయాలు కనిపించడంతో వైద్యులు ఆమెను స్క్రూడ్రైవర్‌తో హత్య చేసినట్లు నిర్ధారించారు.

    దర్యాప్తు ప్రారంభించిన టర్కీ పోలీసులకు హోటల్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆమె భర్తను పట్టుకున్నారు.

    Details

    మానసిక రుగ్మతలకు మందులు వాడుతున్న నేరస్థుడు

    ఆ తర్వాత పోలీసులు విచారణలో అతడు తన భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతను స్క్రూడ్రైవర్‌ ను టాయిలెట్‌లో పారవేసినట్లు చెప్పాడు.

    టర్కీలోని హోమిసైడ్ బ్యూరోలో భర్తను విచారించగా,దాడి జరిగిన రోజున తన భార్య తనకు డ్రగ్స్ ఇచ్చిందని,ఇది వాగ్వాదానికి దారితీసిందని పేర్కొన్నాడు.

    అయితే, హోటల్ గదిలో ఎవరిపైనా డ్రగ్స్ దొరికినట్లు నివేదికలు లేవు. తన స్టేట్‌మెంట్‌లో,అతను మానసిక రుగ్మతలకు మందులు వాడుతున్నట్లు పేర్కొన్నాడు. సాక్ష్యాలను దాచిపెట్టి సంఘటన స్థలం నుండి పారిపోయినట్లు అంగీకరించాడు.

    ఈ జంట నవంబర్ 11 న ఇంగ్లండ్ నుండి ఇస్తాంబుల్‌కు వచ్చారు. నవంబర్ 14 న ఈ హోటల్‌ కి వచ్చారు. ఆ సమయంలోనే ఈ విషాద సంఘటన జరిగింది. ఘటనపై విచారణ కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టర్కీ
    ఇంగ్లండ్

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    టర్కీ

    ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం హైదరాబాద్
    టర్కీలో 7.8 తీవ్రతతో భారీ భూకంకం, భవనాలు నేలకూలి 90 మంది మృతి భూమి
    టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం సిరియా
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం

    ఇంగ్లండ్

    మరో అరుదైన రికార్డుకు చేరువలో బెన్‌స్టోక్స్ యాషెస్ సిరీస్
    నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీ వృథా.. రెండో వన్డేలో ఓటమి పాలైన ఇంగ్లండ్ ఆస్ట్రేలియా
    స్పెషల్ రికార్డుకు చేరువలో జేమ్స్ అండర్సన్ యాషెస్ సిరీస్
    Stuart Broad: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025