English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Big Breaking: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో బాంబుపేలుళ్లు.. సురక్షిత ప్రాంతానికి పాకిస్తాన్ ప్రధాని..! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Big Breaking: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో బాంబుపేలుళ్లు.. సురక్షిత ప్రాంతానికి పాకిస్తాన్ ప్రధాని..! 
    పాక్ ప్రధాని ఇంటి సమీపంలో బాంబుపేలుళ్లు.. సురక్షిత ప్రాంతానికి పాకిస్తాన్ ప్రధాని..!

    Big Breaking: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో బాంబుపేలుళ్లు.. సురక్షిత ప్రాంతానికి పాకిస్తాన్ ప్రధాని..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    12:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌పై పాకిస్థాన్ అనేక దాడులు చేపట్టిన నేపథ్యంలో, భారత్ తీవ్ర ప్రతిదాడికి దిగింది.

    పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి, అక్కడ భీకరమైన ప్రతికార దాడులు నిర్వహిస్తోంది.

    తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాస సమీపంలో బాంబు పేలుడు సంభవించినట్టు సమాచారం.

    ఈ పేలుడు భారత డ్రోన్ల దాడి కారణంగా చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పాక్ సైన్యం అప్రమత్తమై, ప్రధాని షరీఫ్‌ను తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది.

    ఇక బాంబుల పేలుళ్లతో పాకిస్తాన్ అంతా కంపించిపోతోంది.పాక్‌లోని ప్రముఖ నగరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది.

    వివరాలు 

    భారత నౌకాదళ దాడుల తీవ్రతతో పాక్  ఉక్కిరిబిక్కిరి 

    కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్, బహావల్‌పూర్, పెషావర్ వంటి కీలక నగరాల్లో భారత డ్రోన్లు బాంబుల వర్షం కురిపించాయి.

    భారత నౌకాదళ దాడుల తీవ్రతతో పాక్ తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది.

    ఇప్పటికే పాకిస్తాన్ కూడా తమ దురుద్దేశాలను బయటపెట్టింది. ఒకవైపు భారత సరిహద్దు గ్రామాలపై కాల్పులకు పాల్పడుతున్న పాక్, అణచివేతల మధ్యలో గురువారం రాత్రి అనూహ్యంగా భారతదేశంపై విస్తృత దాడులకు తెగబడింది.

    ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలోని ఎయిర్‌పోర్ట్‌తో పాటు అనేక కీలక ప్రదేశాలను మిస్సైల్‌లు, డ్రోన్లతో లక్ష్యంగా చేసుకుంది.

    అంతర్జాతీయ సరిహద్దును దాటి రాత్రి సమయంలో జమ్మూపై రాకెట్లు ప్రయోగించింది.

    మీరు
    25%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    భారత వైమానిక రక్షణ వ్యవస్థలు పూర్తిగా యాక్టివేట్ చేశారు

    దీంతో వెంటనే భారత సైన్యం హై అలర్ట్‌కి వెళ్లింది. భారత వైమానిక దళాలు స్పందనగా ఫైటర్ జెట్లతో తక్షణమే పైకి లేచాయి.

    భారత వైమానిక రక్షణ వ్యవస్థలు పూర్తిగా యాక్టివేట్ చేశారు. వీటి సహాయంతో పాక్ నుంచి దూసుకొచ్చిన రాకెట్లు సమర్థవంతంగా అడ్డుకున్నాయి.

    పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత వాయుసేన సమర్థంగా కూల్చివేసింది. గురువారం సాయంత్రం నాటికి కుప్వారా, బారాముల్లా, పూంఛ్, సాంబా, ఉరి జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం ప్రవర్తనలో స్పష్టమైన కవ్వించే చర్యలు కనిపించాయి.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

     మిస్సైళ్లను, డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా కూల్చేసింది 

    అంతేకాకుండా, జమ్మూ కాశ్మీర్‌ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంగా ఉన్న జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ వంటి కీలక భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ పాక్ డ్రోన్లు, మిస్సైళ్ల దాడులకు దిగింది.

    అయితే భారత రక్షణ వ్యవస్థ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.

    పాక్ ప్రయోగించిన మిస్సైళ్లను, డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా కూల్చివేసింది.

    ఇక, పాక్-ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ప్రారంభించిన 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభమైన 48 గంటల వ్యవధిలోపే, పాకిస్తాన్ భారత్‌పై ఈ విరుచుకుపడిన దాడులకు పాల్పడింది.

    మీరు
    75%
    శాతం పూర్తి చేశారు

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     పాకిస్తాన్ ప్రధాని ఇంటి సమీపంలో బాంబుపేలుళ్లు

    Pak PM Sehbaz taken to a Safe house. A big blast happened around 22 KM distance from PM's house in Pak. pic.twitter.com/tvqzKT1PRg

    — Girish Bharadwaj (@Girishvhp) May 8, 2025
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    పాకిస్థాన్

    Pak ISI Chief: భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. ISI చీఫ్ మహ్మద్ అసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు అంతర్జాతీయం
    India-Pakistan: హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోని పాకిస్థాన్.. సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపు చర్యలు భారతదేశం
    Pakistani Actors: హనియా అమీర్,మహీరా ఖాన్ సహా పలువురు పాక్ నటుల ఇన్‌స్టా అకౌంట్స్ బ్లాక్  సినిమా
    Pakistan:పాక్‌ సైనిక విమానాలకు నేవిగేషన్‌ సిగ్నల్స్‌ అందకుండా భారత్‌ చర్యలు.. ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థలు మోహరింపు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025