LOADING...
Donald Trump: భారత్ వెనెజువెలా చమురు దిగుమతులకు సిద్ధం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారత్ వెనెజువెలా చమురు దిగుమతులకు సిద్ధం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Donald Trump: భారత్ వెనెజువెలా చమురు దిగుమతులకు సిద్ధం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2026
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా నుంచి చమురు దిగుమతుల్లో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ మాట్లాడారు. మేము ఇప్పటికే వెనెజువెలాతో ఒక డీల్‌ను కుదుర్చుకున్నాం. ఇందులో భారత్‌ కూడా చేరనుంది. భారత్‌ ఇకపై వెనెజువెలా చమురును దిగుమతి చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చామన్నారు. కానీ, ఇప్పటివరకు భారత ప్రభుత్వం ఈ అంశంపై ఏ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు చైనా కూడా వెనెజువెలా చమురు కోసం చర్చలు జరపవచ్చని, దానిని స్వాగతిస్తామన్నారు.

Details

నరేంద్ర మోదీ, రోడ్రిగ్జ్ మధ్య ఫోన్‌లో సంభాషణ

వెనెజువెలా పాలనపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం తన అధీనంలోనే ఉందని, తనకు కావలసిన విధంగా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ట్రంప్ ప్రకారం, వెనెజువెలా చమురు నిల్వలు అమెరికా నియంత్రణలోకి రావాల్సినంత వరకు రోడ్రిగ్జ్ తాత్కాలిక నాయకురాలిగా కొనసాగుతారు. వెనెజువెలాపై సైనిక దాడి ద్వారా ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా నిర్బంధించింది. ఆ తర్వాత డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారన్నారు. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ, రోడ్రిగ్జ్ మధ్య ఫోన్‌లో సంభాషణ జరిగింది. అందులో ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి పలు ద్వైపాక్షిక అంశాలను చర్చించారని ట్రంప్ తెలిపారు.

Advertisement