
US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్‌లో వెల్లడి!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) 2025 'వరల్డ్‌వైడ్ త్రెట్ అసెస్‌మెంట్' నివేదికను తాజాగా విడుదల చేసింది.
ఇందులో ప్రపంచ స్థాయిలో ఉత్పన్నమవుతున్న రక్షణ భద్రతా ముప్పులపై విపులంగా విశ్లేషించింది. పాకిస్తాన్-భారత సంబంధాల పక్షాన ఈ నివేదిక చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
నివేదిక ప్రకారం పాకిస్తాన్ తన అస్తిత్వానికి ముప్పుగా భారతదేశాన్ని భావిస్తోంది.
భారత మిలిటరీ ఆధిక్యతను తట్టుకోవడానికి పాకిస్తాన్ చైనాతో కలిసి తన అణ్వాయుధ సామర్థ్యాన్ని ఆధునీకరిస్తోందని స్పష్టం చేసింది.
ఈ వ్యాఖ్యలు ఇటీవల భారత్ విజయవంతంగా నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' తరుణంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ చూపిన సైనిక సత్తా వల్ల పాకిస్తాన్ సైన్యం కాళ్లబేరానికి వచ్చినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
Details
మిలిటరీ అధునీకరణకు తోడ్పాటు
భారతదేశం తన ప్రధాన ముప్పుగా చైనాను పరిగణిస్తోంది. ఆ తర్వాతే పాకిస్తాన్ అని భావిస్తోంది.
చైనా వ్యాప్తిని ఎదుర్కొనడంలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలకు భారత్ ప్రాధాన్యత ఇస్తోందని ఈ నివేదిక పేర్కొంది.
భారత్-చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల విషయానికి వస్తే, 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ఉద్రిక్తతలు కొంత తగ్గాయని, కానీ సరిహద్దు వివాదాలు ఇంకా పరిష్కారం కాలేదని రిపోర్ట్ పేర్కొంది.
భారత దేశీయ రక్షణ రంగం విషయానికి వస్తే, 'మేడ్ ఇన్ ఇండియా' చొరవ 2025లోనూ కొనసాగుతుందని, దీనివల్ల సరఫరా గొలుసు సమస్యలు తగ్గిపోతాయని, మిలిటరీ ఆధునీకరణకు తోడ్పడుతుందని నివేదిక స్పష్టం చేసింది.
Details
2024లో భారత్ చేసిన అభివృద్ధిలో భాగంగా
అగ్ని-I ప్రైమ్ MRBM
అగ్ని-V మల్టిపుల్ ఇండిపెండెంటబుల్ టార్గెటెబుల్ రీఎంట్రీ వెహికిల్ (MIRV)
పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని పేర్కొంది.
అలాగే భారత అణు త్రయాన్ని బలోపేతం చేయడంలో భాగంగా, రెండవ అణుశక్తితో నడిచే జలాంతర్గామిని ప్రారంభించినట్లు నివేదిక వెల్లడించింది.
ఇది ప్రత్యర్థులను అణగదొక్కే సామర్థ్యాన్ని మరింతగా పెంచే అవకాశముందని పేర్కొంది.
Details
ఆర్థిక, రక్షణ ప్రయోజనాల కోసం రష్యాతో సంబంధాలు
రష్యాతో సంబంధాల అంశంలోనూ కీలక విశ్లేషణలు చేశాయి. భారత్ తన ఆర్థిక, రక్షణ ప్రయోజనాల దృష్ట్యా రష్యాతో సంబంధాలను కొనసాగిస్తుందని పేర్కొంది.
మోదీ పాలనలో భారత్ రష్యా నుండి నేరుగా సైనిక పరికరాల కొనుగోళ్లను తగ్గించినప్పటికీ చైనా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చిన ముప్పుల ఎదుర్కొనడంలో రష్యన్ ట్యాంకులు, యుద్ధ విమానాల నిర్వహణలో భారత్ ఇప్పటికీ రష్యన్ విడిభాగాలపై ఆధారపడుతోందని నివేదిక వెల్లడించింది.
ఈ నివేదికలోని అంశాలు భారత్ భద్రతా వ్యూహాల్లో మార్పులకు దారి తీసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయం.